హైదరాబాద్‌లో మద్యం మత్తులో యువతి బీభత్సం....యువకుడు మృతి
- మద్యం మత్తులో జుమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్‌ని కారుతో ఢీకొట్టిన ఢిల్లీ యువతి
- చికిత్స పొందుతూ ఒకరు మృతి...ఆసుపత్రిలో మరొకరు
- నిందితురాలిపై మోటారు వాహన చట్టంలోని 304ఏ, 338, 185 సెక్షన్ల కింద కేసు నమోదు
రక్తపు మడుగులో పడి ఉన్న చిరంజీవి, సాయిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చిరంజీవి ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. సాయికుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఢిల్లీకి చెందిన జెన్ని జాకబ్ నాలుగు రోజుల కిందట తన స్నేహితురాలు లిజాతో కలిసి కోకాపేట గ్రీన్‌బ్లాసమ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న స్నేహితుడు రౌనిత్ కుమార్ వద్దకు వచ్చారు. నగర వీక్షణ కోసం ఓ కారును అద్దెకు తీసుకుని ఆమె సొంతంగా డ్రైవ్ చేస్తూ తిరుగుతోంది.
కాగా, ప్రమాదం జరిగిన సమయంలో జెన్నీ మద్యం సేవించి ఉందని, బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్ష చేస్తే మీటరు రీడింగ్ 51 వచ్చిందని రాయదుర్గం ఇన్స్‌పెక్టర్ రాంబాబు తెలిపారు. మోటారు వాహన చట్టంలోని 304ఏ, 338, 185 సెక్షన్ల కింద నిందితురాలిపై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.