రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా పవన్ కల్యాణ్ మాట్లాడారు.. పెద్ద కుట్ర జరుగుతోంది: బోండా ఉమా
Add ap7am to your home Screen

రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా పవన్ కల్యాణ్ మాట్లాడారు.. పెద్ద కుట్ర జరుగుతోంది: బోండా ఉమా

  • పవన్ అవగాహనా రాహిత్యంతో విమర్శించారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు
  • శేఖర్ రెడ్డికి, నారా లోకేశ్‌కు సంబంధం ఏంటీ?
  • మోదీ ప్రభుత్వాన్ని అందరూ విమర్శిస్తున్నారు
  • అన్ని అడ్డంకులను అధిగమించి రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తాం
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై జాతీయ ఛానెళ్లలోనూ కథనాలు వస్తున్నాయని, మోదీ ప్రభుత్వాన్ని వారంతా విమర్శిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరావు అన్నారు. ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా పవన్ కల్యాణ్ మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలు అర్థరహితంగా, బాధ్యతారహితంగా ఉన్నాయని, ప్రజలు వాటిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటున్నారని చెప్పారు.

శేఖర్ రెడ్డికి, నారా లోకేశ్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించిన బోండా ఉమా.. పవన్ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని అన్నారు. రోజు రోజుకీ రాష్ట్ర రాజకీయాలు మారిపోతున్నాయని, పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. వైసీపీ ఎంపీలు పీఎంవో ఆఫీసు దగ్గర ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించారు. తాము రాష్ట్ర ప్రయోజనాలను సాధించే క్రమంలో ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగామని, ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చేశామని చెప్పారు. అన్ని అడ్డంకులను అధిగమించి రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామని తెలిపారు.
Pawan Kalyan
Bonda Uma
Telugudesam

More Telugu News