venkatesh: తేజ సినిమా కోసం 15 కేజీలు తగ్గనున్న నారా రోహిత్

షార్ట్స్‌లో చూడండి
ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నారా రోహిత్ నటనలో పరిణతిని సాధిస్తున్నాడు. కొత్తదనంతో కూడిన కథైతే చాలు .. మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే' చేయడానికి అంగీకరించాడు. తేజ దర్శకత్వంలో మల్టీస్టారర్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక హీరోగా వెంకటేశ్ నటిస్తుండగా .. మరో హీరోగా నారా రోహిత్ కనిపించనున్నాడు.

ఈ ఇద్దరూ కూడా ఈ సినిమాలో బావ - బావమరుదులుగా కనిపించనున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం బాగా బరువు తగ్గాలని రోహిత్ కి తేజ చెప్పాడట. దాంతో బాగా కసరత్తులు చేసిన రోహిత్ 10 కేజీల వరకూ బరువు తగ్గాడట. మరో 5 కేజీల వరకూ తగ్గాలని తేజ అనడంతో .. ప్రస్తుతం రోహిత్ అదే పనిలో వున్నాడని చెబుతున్నారు. ఇక ఒక కథానాయికగా అదితీరావును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.    
Go Back to Shorts
venkatesh
nara rohith

More Telugu News