బీహార్ 'సో.. స్వీట్' అంటోన్న బాలీవుడ్ బ్యూటీ సోనాల్!
Add ap7am to your home Screen

బీహార్ 'సో.. స్వీట్' అంటోన్న బాలీవుడ్ బ్యూటీ సోనాల్!

  • బాలీవుడ్‌ అనుకుంటున్నట్లుగా బీహార్ నేర రాష్ట్రం కాదు
  • ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లు, మంచి మనసున్న వారు
  • బీహార్ మాల్స్, ఫ్లైఓవర్లు, బ్రాండెడ్ ఔట్‌లెట్లు అన్నీ ఉన్నాయ్
  • ఇటీవల పాట్నాలో జరిగిన సామ్‌సంగ్ ఎస్9 స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో సోనాల్
బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ బీహార్‌ను నేరస్థులకు అడ్డాగా చూపిస్తుంటారు. అందువల్ల మనకి కూడా బీహార్‌పై అదే రకమైన అభిప్రాయం కలుగుతుంది. కానీ బాలీవుడ్‌లో జన్నత్ సినిమా ద్వారా హాట్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనాల్ చౌహాన్ మాత్రం బీహార్ సో స్వీట్ అని సర్టిఫికెట్ ఇస్తోంది. "బాలీవుడ్ సినిమాల్లో బీహార్‌ను నేరస్థులకు, నేరాలకు నెలవైన రాష్ట్రంగా చూపిస్తున్నారు. కానీ అది సరికాదు. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. మంచి మనసున్న వారు" అని ఆమె అంటోంది.

అంతేకాక బీహార్ అభివృద్ధి చెందని రాష్ట్రమని చెప్పడం కూడా సరికాదనే అభిప్రాయాన్ని ఈ ముద్దుగుమ్మ వ్యక్తం చేసింది. "బీహార్ అభివృద్ధికి నోచుకోని రాష్ట్రమని చెబుతున్నారు. కానీ, ఇక్కడి ప్రజలు చాలా వరకు ఒకే రీతిలో ఆర్థికంగా అభివృద్ధి చెందడం కనిపిస్తోంది. దాదాపు అన్ని పెద్ద బ్రాండ్ల అవుట్‌లెట్లు కూడా ఇక్కడ ఉండటం నేను గుర్తించాను. ఇక్కడ మాల్స్ ఉన్నాయి. చాలా ఫ్లైఓవర్లూ ఉన్నాయి. అందువల్ల బీహార్ రాష్ట్రం లేదా పాట్నా నగరం అభివృద్ధి చెందలేదని నేను చెప్పలేను" అని సోనాల్ బీహార్‌పై ఇప్పటివరకు ఉన్న 'నేర' ముద్రను  తుడిచేసే ప్రయత్నం చేసింది. సామ్‌సంగ్ కంపెనీ 'ఎస్9' మోడల్ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ కోసం ఆమె ఇటీవల పాట్నా వచ్చినప్పుడు ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Sonal chauhan
Bollywood
Bihar
Patna
Samsung

More Telugu News