తనకు సోకిన అరుదైన వ్యాధిని బయటపెట్టిన నటుడు ఇర్ఫాన్ ఖాన్
Add ap7am to your home Screen

తనకు సోకిన అరుదైన వ్యాధిని బయటపెట్టిన నటుడు ఇర్ఫాన్ ఖాన్

  • నాకు న్యూరో ఎండో క్రిన్ ట్యూమర్ ఉంది
  • ఆ విషయం తెలిసినప్పుడు కష్టమనిపించింది
  • ఓ ట్వీట్ లో పేర్కొన్న ఇర్ఫాన్ ఖాన్
తనకు ఓ అరుదైన వ్యాధి సోకిందని, మరో వారం పది రోజుల్లో ఆ వ్యాధి గురించి బయటపెడతానని బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తనకు సోకిన అరుదైన వ్యాధి గురించి ఈ రోజు వెల్లడించారు. ఈ మేరకు ఇర్ఫాన్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు.

‘ఒక్కోసారి మనం ఊహించనిది మనల్ని పెద్ద వాళ్లని చేస్తుంది. నాకు న్యూరో ఎండో క్రిన్ ట్యూమర్ ఉందని తెలినప్పుడు, దానిని అంగీకరించేందుకు కష్టంగా అనిపించింది. కానీ, ప్రేమాభిమానాలు చూపించే వారు నా చుట్టూ ఉండటంతో నాలో కొత్త ఆశలు చిగురించాయి... మీ అందరి దీవెనలు నాకు పంపిస్తూనే ఉండండి..’ అంటూ పేర్కొన్న ఇర్ఫాన్ ఖాన్, నాటి అమెరికన్ రచయిత మార్గెరెట్ మిచెల్ సూక్తిని ప్రస్తావించాడు.
Bollywood
irfan khan

More Telugu News