ఆ నిర్ణయం తీసేసుకున్నారుగా... మీ ఇష్టం: చంద్రబాబుతో ఫోన్ లో అమిత్ షా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ నిర్ణయం తీసేసుకున్నారుగా... మీ ఇష్టం: చంద్రబాబుతో ఫోన్ లో అమిత్ షా

  • పెద్దగా స్పందించని అమిత్ షా
  • ముందే తెలుసునన్నట్టుగా మాట్లాడిన బీజేపీ చీఫ్
  • మరికాసేపట్లో టీడీపీ అవిశ్వాసం!
ఈ ఉదయం ఎన్డీయే నుంచి వైదొలగుతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్ చేసి చంద్రబాబునాయుడు చెప్పిన వేళ, ఆయన్నుంచి పెద్దగా స్పందనేమీ రాలేదని తెలుస్తోంది. టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంటుందని తమకు ముందే తెలుసునన్నట్టుగా అమిత్ మాట్లాడారని పార్టీ వర్గాల సమాచారం. మీరు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన తరువాత ఇక మాట్లాడేందుకు ఏముంటుందని వ్యాఖ్యానించిన అమిత్ షా, మీ ఇష్టమని వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, మరికాసేపట్లో తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులతో సమావేశమై అవిశ్వాస తీర్మానంపై ఓ నిర్ణయం తీసుకుంటారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
Chandrababu
Amit Shah
Telugudesam
NDA

More Telugu News