2జీ కేసులో కేంద్రానికి సుప్రీం మొట్టికాయలు...దర్యాప్తు ముగింపుకు ఆరు నెలల గడువు
- 2జీ కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సుప్రీం ధర్మాసనం సీరియస్
- ఆరు నెలల్లో పూర్తి చేయాలని సీబీఐ, ఈడీలకు హుకుం
- రెండు వారాల్లోగా స్టేటస్ నివేదిక సమర్పించాలని కేంద్రానికి ఆదేశం
2జీ కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోందని బెంచ్ అభిప్రాయపడింది. ఇలాంటి సున్నితమైన అంశాల్లో దేశ ప్రజలను మభ్యపెట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది. మరోవైపు 2014లో ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా తాను నియమించిన సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్‌ని కూడా ఆ బాధ్యత నుంచి తప్పించింది. ఆయన స్థానంలో కేంద్రం సిఫారసు చేసిన అడిషినల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నియామకానికి అంగీకరించింది.