స్కూల్ డేస్ లో గోల గోల చేసేవాడిని .. అందుకే ఎక్కువసార్లు బయట నిలబెట్టేవాళ్లు: హైపర్ ఆది
- స్కూల్ డేస్ లో అల్లరి ఎక్కువ
- అందరి నోళ్లలో నా పేరు నానేది
- చదువులో వెనుకబడలేదు
"ఫలానా క్లాస్ లో ఆది అనేవాడు వుంటాడు .. వాడు బాగా గొడవ చేస్తాడు అని చెప్పుకునేవారు. అంత గోల చేసేవాడిగా పేరున్నా చదువులో ఎప్పుడూ వెనుకబడలేదు. బాగా చదువుతూ .. మంచి మార్కులు తెచ్చుకునేవాడిని. బాగా గోల చేస్తాననే పేరు రావడంతో ఎక్కువసార్లు క్లాస్ బయట నిలబెట్టేవాళ్లు. ఒక్కోసారి నేను బాధ్యుడిని కాకపోయినా, క్లాస్ లో నుంచి నన్నే బయటికి పంపించేవాళ్లు. అంతగా టీచర్లకు గుర్తుండిపోయేవాడిని" అంటూ చెప్పుకొచ్చాడు.