YSRCP: వైసీపీ స్టోరీ, స్క్రీన్ ప్లే నరేంద్ర మోదీయా?: జగన్ కు కౌంటరేసిన పవన్ కల్యాణ్

  • టీడీపీలో జనసేన అంతర్భాగం
  • ఆ పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు
  • జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన పవన్
ఈ ఉదయం గుంటూరు జిల్లా కాజ టోల్ గేట్ సమీపంలో తన కొత్త ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల జగన్ చేసిన కామెంట్లపై కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో జనసేన అంతర్భాగమని, ఆ పార్టీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబేనని, ఆయన ఆదేశాలతోనే జనసేన పనిచేస్తోందని జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, "జనసేనకు చంద్రబాబు అయితే వైసీపీకి మోదీ అనుకోవాలా?" అని ఆయన ప్రశ్నించారు. ఒక విమర్శ చేయడం ఎంతో సులభమని, దానికన్నా ముందు నిజానిజాలను తెలుసుకోవాలని హితవు పలికిన ఆయన, రాజకీయ నాయకులు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. సాధ్యమైనంత త్వరలోనే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించి, ఇక్కడకు మారిపోతానని పవన్ స్పష్టం చేశారు. 

More Telugu News

YSRCP
Jana Sena
Pawan Kalyan
Jagan