Telugudesam: పార్టీ పటిష్ఠతకు పాటుపడతా : కనకమేడల రవీంద్రకుమార్
ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా తనను ఎంపిక చేయడంపై కనకమేడల రవీంద్రకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, లీగల్ సెల్ ద్వారా పార్టీకి తాను చేస్తున్న సేవలను గుర్తించిన చంద్రబాబు, తనకు పూర్తి న్యాయం చేశారని, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని,ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, పార్టీ పటిష్టతకు పాటుపడతానని చెప్పారు. ముప్పై ఐదేళ్లుగా తాను న్యాయవాద వృత్తిలో ఉన్నానని, ఇరవై రెండేళ్లుగా టీడీపీ లీగల్ సెల్, అందుకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటున్నానని చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు తన కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నానని, ఏపీకి హక్కుల సాధనకు దశలవారీ పోరాటంలో భాగంగా అన్ని మార్గాలను అవలంబిస్తామని చెప్పారు.