అతన్ని గదిలోకి పంపి.. తలుపు వేసేశాడు: క్రికెటర్ షమీ భార్య
- ఆయన అన్నను పడకగదిలోకి పంపించి తలుపు వేసేశాడు
- ఆయన కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు
- షమీ భార్య తాజా ఆరోపణలు
క్రికెటర్ షమీపై గృహ హింస, హత్యాయత్నం కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అతని భార్య హసీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోల్ కత్తా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, తన భర్తపై హసీన్ చేస్తున్న ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఆమె మరో విషయాన్ని వెల్లడించారు. అతని సోదరుడిని తన గదిలోకి పంపి, బయట తాళం వేశాడని ఆమె ఆరోపించారు. అతనితో పడక పంచుకోవాలంటూ తనను బలవంతం చేశాడని చెప్పారు. అతని సోదరుడు కూడా పడక గదిలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. అప్పుడు తాను కేకలు వేయడంతో, గది తలుపులను షమీ తీశాడని చెప్పారు. 'నువ్వు మోడల్ వి కదా. ఇలాంటివన్నీ మామూలే' అని షమి తనతో అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా... రెండో పెళ్లిదానివంటూ తనను దుర్భాషలాడేవాడని చెప్పారు. షమి భార్య హసీన్ కు ఇది రెండో పెళ్లి. మొదటి భర్తతో ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.