shiva reddy: నేను ఎలా ఉండకూడదో నా అనుభవాలే చెప్పాయి: శివారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
నటుడిగా .. మిమిక్రీ ఆర్టిస్ట్ గా శివారెడ్డికి మంచి క్రేజ్ వుంది. తెరపైనా .. స్టేజ్ పైన ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. అలాంటి శివారెడ్డి తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడారు. శివారెడ్డి ఇంటికి వెళితే ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు .. అతిథి మర్యాదలు చేస్తారని చాలామంది చెప్పుకుంటూ వుంటారు. అదే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తే, ఆయన తనదైన శైలిలో స్పందించారు.

" ఇంటికి వచ్చిన వారిని గౌరవించాలి .. ఆత్మీయంగా పలకరించాలి అనే విషయాన్ని, నాకు ఎదురైన కొన్ని సంఘటనలు నేర్పించాయి. ఒక పెద్ద ఆర్టిస్ట్ వున్నాడండీ .. ఇంటికి వెళితే మంచినీళ్లు తాగుతారా అని కాదు గదా .. లోపలికి రమ్మని కూడా అనడు. అలాంటి సందర్భంలో మనసుకు చాలా బాధ కలుగుతుంది. ఎవరింటికైనా వెళ్లినప్పుడు మంచినీళ్లు గానీ .. టీ గాని ఇవ్వకపోతే, ఏంటి వీళ్లు కనీసం టీ తాగుతారా అని కూడా అడగలేదు అనుకునేవాడిని. మన ఇంటికి ఎవరు వచ్చినా ఈ విధంగా మాత్రం చేయకూడదు అనిపించింది. అందుకే మా ఇంటికి వచ్చిన పోస్ట్ మేన్ కి కూడా టీ ఇచ్చే పంపిస్తాం" అని చెప్పుకొచ్చాడు.   
Go Back to Shorts
shiva reddy

More Telugu News