chennai: చెన్నైలో కలకలం.. కాలేజీ ముందు బీకాం విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

షార్ట్స్‌లో చూడండి
చెన్నైలోని కేకేనగర్‌లో అశ్విని అనే అమ్మాయిని అళగేశన్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపి కలకలం సృష్టించాడు. హత్య చేసి పారిపోతోన్న అళగేశన్‌ను స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. సదరు అమ్మాయి మీనాక్షి కాలేజీలో బీకాం ఫస్టియర్ చదువుతోందని.. ఈ రోజు కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో గేట్ వద్ద నిల్చొని ఉందని, అదే సమయంలో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడని తెలిపారు.

దీంతో అశ్విని రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు చెప్పారు. స్థానికులు చితక్కొట్టడంతో నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయని ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ అమ్మాయిని యువకుడు ఎందుకు హత్య చేశాడన్న విషయం తెలియాల్సి ఉంది. 
Go Back to Shorts
chennai
murer
girl

More Telugu News