షాపింగ్ కు వెళ్లి, కెమెరాకు చిక్కి ముఖం దాచుకున్న బాలీవుడ్ సీనియర్ హీరోయిన్... వీడియో చూడండి
Add ap7am to your home Screen

షాపింగ్ కు వెళ్లి, కెమెరాకు చిక్కి ముఖం దాచుకున్న బాలీవుడ్ సీనియర్ హీరోయిన్... వీడియో చూడండి

  • కళానికేతన్ క్లాసిక్ లో షాపింగ్ కు వెళ్లిన రేఖ
  • షాపింగ్ ముగించుకుని వస్తుండగా గుర్తుపట్టి వీడియో తీసిన అభిమాని
  • కెమెరాను చూసి ముఖం తిప్పుకున్న రేఖ
ప‌్రముఖ సినీ సీనియర్‌ నటి రేఖ కెమెరాను ముఖం కవర్ చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళానికేతన్ క్లాసిక్ షోరూంలో షాపింగ్ కు వెళ్లిన రేఖ బయటకు వస్తున్న సమయంలో చూసిన అభిమాని ఆమెను చిత్రీకరించాడు. దానిని గుర్తించిన ఆమె ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ఇంతలో ఆమె డ్రైవర్ వచ్చి అభిమానిని ప్రశ్నించి కారు డోర్ తెరిచారు. దీంతో వేగంగా కారులో కూర్చుని డోర్ మూసేశారు. కెమెరా ముందు బెరుకులేకుండా నటించే రేఖ కెమెరాను చూసి ముఖం దాచుకున్నారంటూ ఈ వీడియోను అప్ లోడ్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ ప్రదేశం ఎక్కడన్నది మాత్రం నెటిజన్ వివరించకపోవడం విశేషం. 
rekha
actress
Bollywood
Viral Videos

More Telugu News