ఏపీని మోసం చేసిన బీజేపీ అంతకు అంతా అనుభవిస్తుంది.. సీపీఐ నారాయణ హెచ్చరిక
- చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
- ఏపీకి బీజేపీ మొండిచేయి చూపింది
- మోసానికి ప్రతిఫలం అనుభవిస్తుంది
నాలుగేళ్లుగా ఏపీకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచేయి చూపిందని ఆరోపించారు. ఏపీకి చేసిన మోసానికి ప్రతిగా బీజేపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పునరుద్ఘాటించారు.