kanna: ఏపీ అభివృద్ధికి ఇంకా పదేళ్ల సమయం ఉంది: బీజేపీ నేత కన్నా

షార్ట్స్‌లో చూడండి
ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని, రాష్ట్రాభివృద్ధికి ఇంకా పదేళ్ల సమయం ఉందని .. ఈ పదేళ్లలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంత సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.12,500 కోట్లు ఇస్తే ఇంతవరకూ లెక్కలు చెప్పలేదని విమర్శించారు.

కేంద్రం నుంచి వచ్చిన నిధులు దేని కోసం ఖర్చు చేశారో, అందుకు సంబంధించిన నివేదిక కేంద్రానికి ఇచ్చి ఏపీ అభివృద్ధికి తోడ్పడాలని అధికార పార్టీ నాయకులకు ఆయన సూచించారు. బీజేపీపై విమర్శలు చేయడం సబబు కాదని, ఏపీలో బీజేపీని దోషిగా చిత్రీకరిస్తూ, మిత్ర ధర్మానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రవర్తిస్తోందంటూ ఆరోపించారు.  
Go Back to Shorts
kanna
Andhra Pradesh

More Telugu News