alari naresh: సినిమా వాళ్లనగానే వేరుగా చూడటం నాకు బాధ కలిగిస్తుంది: అల్లరి నరేశ్

షార్ట్స్‌లో చూడండి
అల్లరి నరేశ్ సినిమా అనగానే అందులో కావాల్సినంత కామెడీ వుంటుందనే విషయం అర్థమైపోతుంది. అందువల్లనే ఆయన సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అలాంటి అల్లరి నరేశ్ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. అనేక విషయాలను ప్రస్తావించారు.

" సినిమా వాళ్లను చూడటానికి ఆసక్తిని చూపుతారు. వాళ్లతో కలిసి సెల్ఫీ లు దిగడానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. కానీ సినిమావాళ్లకి ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. మేం చెన్నైలో ఉండగా మా విషయంలోను ఇలాగే జరిగింది. మాకు నైన్ టూ ఫైవ్ అనే టైమింగ్ ఉండదనే గానీ .. మేము కష్టపడుతున్నాం .. గౌరవంగా బతుకుతున్నాం.  ఇక సినిమావాళ్లకి లోన్లు ఇవ్వరు .. పిల్లను ఇవ్వరు. నా విషయంలోనూ ఇదే జరిగింది. నాతో విరూప పెళ్లి కుదిరినప్పుడు, 'సినిమా వాళ్లకి ఇస్తున్నారా .. ఎందుకూ'? అంటూ చాలామంది వాళ్ల పేరెంట్స్ తో అన్నారట. ఇలా సినిమా వాళ్లను వేరుగా చూడటమే నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.   
Go Back to Shorts
alari naresh
virupa

More Telugu News