తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారని చెప్పి దేశ రాజకీయాలు ఉద్ధరిస్తారు? : బీజేపీ నేత లక్ష్మణ్
- వేరే పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారు
- మాటల గారడీతో ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరు
- బీజేపీ ఎదుగుదలను చూసి కాలం చెల్లిన పార్టీలు ఓర్వలేకపోతున్నాయి
టీఆర్ఎస్ ను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని, బీజేపీ ఎదుగుదలను చూసి కాలం చెల్లిన పార్టీలు ఓర్వలేకపోతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై కేసీఆర్ నోరు జారిన విషయాన్ని కేటీఆర్, కవితే చెప్పారని, ఆ విషయాన్ని కేసీఆర్ హుందాగా ఒప్పుకోవాలని హితవు పలికారు.