కొత్త పార్టీ : ‘తెలంగాణ ప్రజల పార్టీ’ ఆవిర్భావం
Add ap7am to your home Screen

కొత్త పార్టీ : ‘తెలంగాణ ప్రజల పార్టీ’ ఆవిర్భావం

  • జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో కొత్త పార్టీ ఆవిర్భావం
  • అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మా పార్టీ పని చేస్తుంది
  • రాష్ట్రంలో అందరికీ సమానావకాశాల కల్పన, కుల వివక్ష నిర్మూలన మొదలైన అంశాలపై పోరాడతాం: జస్టిస్ చంద్రకుమార్
తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో ‘తెలంగాణ ప్రజల పార్టీ’ పేరిట కొత్త పార్టీ  ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అందరికీ సమానావకాశాలు కల్పించడం కోసం, కులవివక్ష నిర్మూలన, నిరుపేదలందరికీ, ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం తమ పార్టీ ఆశయాలని పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. తొలుత, పార్టీని ప్రకటించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
Telangana
justice chandra kumar

More Telugu News