పవన్ కల్యాణ్, ఇక కదలండి... జనసేన కార్యాలయానికి వెల్లువెత్తుతున్న కార్యకర్తల సందేశాలు!
- జేఎఫ్సీ నివేదికపై పోరాటం ప్రారంభించండి
- ఇదే సరైన సమయమంటున్న అభిమానులు
- జనసేన కార్యాలయం వద్ద సందడి
- పవన్ స్పందిస్తారంటున్న నేతలు
ఈ ఉదయం నుంచి జనసేన కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి కనిపిస్తోంది. మరోవైపు హోదాపై పోరాటం వెంటనే ప్రారంభించాలని జనసేన ఆఫీసుకు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానుల సూచనలను పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలోనే వారి డిమాండ్లపై పవన్ స్పందిస్తారని, కార్యాలయం బయటకు వచ్చి అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్న నేతలు కొందరు వ్యాఖ్యానించారు.