పారిస్ మెట్రో స్టేషన్‌లో భారత వజ్రాల వ్యాపారులను నిలువునా దోచేసిన దుండగులు!
- పారిస్‌లో రెచ్చిపోతున్న హై-ప్రొఫైల్ వజ్రాల దొంగలు
- దోపిడీకి గురైన సొత్తు విలువ రూ.2.41 కోట్లు
- గతంలో నటి కిమ్ కిండర్సన్‌ను దోచేసిన దుండగులు
పారిస్‌లో హై-ప్రొఫైల్ వజ్రాల దొంగలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా వీరి సంఖ్య మరింత పెరిగింది. ఈ జనవరిలో రిట్జ్ హోటల్‌లో భారీ దోపిడీ జరిగింది. అక్టోబరు, 2016న ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు వచ్చిన యూఎస్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కిండర్సన్ కాళ్లు, చేతులు కట్టేసి కణతకు తుపాకి గురిపెట్టి 9 మిలియన్ యూరోల విలువైన వజ్రాభరణాలను దోచుకున్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.