ఈ తూరుపు... ఆ పశ్చిమం!: మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఆంధ్రుడు, అమెరికా యువతి!
- విజయవాడలోని ఓ హోటల్‌లో పెళ్లి
- గుంటూరు జిల్లా వినుకొండలోని పొట్టూరుకి చెందిన వరుడు రాము
- అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లి లొరెనా అనే అమ్మాయితో లవ్
- పెద్దల సమక్షంలో వివాహం
అతడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లగా, కాలేజీలో లొరెనా అనే అమ్మాయితో స్నేహం ఏర్పడింది. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకుని, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. రాములోని కష్టించేతత్వం తనకు బాగా నచ్చిందని లొరెనా తెలిపింది. మూడేళ్లు ప్రేమలో మధురానుభూతులను పొందిన వారిరువురూ ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో దంపతులయ్యారు. వారి పెళ్లికి మొదట పెద్దలు అడ్డుచెప్పినా.. చివరకు ఒప్పుకున్నారు.