MOTHKUPALLI: నేను లేకుండానే మీటింగ్ పెట్టారు.. ఇది నాకు చాలా బాధనిపించింది: మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
నిన్న తాను లేకుండానే హైదరాబాద్‌లో టీటీడీపీ మీటింగ్‌ పెట్టారని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పట్ల తాను చాలా బాధ పడుతున్నానని అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "ఎన్టీఆర్‌ దగ్గర ఎలా పని చేశానో చంద్రబాబు దగ్గర కూడా అలాగే ఎంతో నమ్మకంగా చేస్తున్నాను. తెలంగాణ వాదం వచ్చినప్పుడు కూడా చంద్రబాబు తరఫున నేను తప్ప ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పట్లో చంద్రబాబుపై చాలామంది అనేక రకాల విమర్శలు చేశారు.

అటువంటి సమయంలో ఏ టీడీపీ నాయకుడు కూడా ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టలేకపోయాడు. అప్పట్లో తెలంగాణలో టీడీపీ తరఫున మాట్లాడితే చంద్రబాబుకి అనుకూలం అనుకుంటారని అందరూ భయపడిపోయారు. నేను మాత్రమే చంద్రబాబు తరఫున నిలబడి మాట్లాడాను. చంద్రబాబును పార్టీ నేతలే అవమానపరిచారు. నేను ఎన్టీఆర్‌కి ఎలా శిష్యుడిగా ఉంటానని ప్రమాణం చేశానో చంద్రబాబుకి కూడా అలాగే ఉన్నాను. ఆ సమయంలో కొందరు రెక్కీ నిర్వహించి నన్ను చంపాలనుకున్నారు. ఇవన్నీ చంద్రబాబుకి తెలుసు. నా జీవితం బలిచేసి చంద్రబాబు పక్కన నిలబడ్డా. అందుకు గర్విస్తున్నాను..

ఇటువంటి అవకాశం అందరికీ రాదు.. పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడాను. చంద్రబాబు నాకు ఏమిచ్చినా, ఏమి ఇవ్వకపోయినా నేను చంద్రబాబు తమ్ముడిలాంటి వాడినే. తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. తెలంగాణలో పటిష్ఠమైన నాయకత్వం లేదు. నీతి కలిగిన టీడీపీ భ్రష్టుపట్టిపోయింది. నాయకత్వం సరిగ్గా లేదు. ఎవరెవరికి పదవులు ఇచ్చారో వారే చంద్రబాబుకి ద్రోహం చేశారు" అని అన్నారు.
Go Back to Shorts
MOTHKUPALLI
Chandrababu
Telugudesam

More Telugu News