Samanta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • స్టార్ ఇమేజ్ గురించి సమంత
  •  'నా పేరు సూర్య' కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • జ్యోతిక పాత్రలో అనుష్క? 
  • మరోసారి హీరోగా సప్తగిరి 

*  'స్టార్ ఇమేజ్ వచ్చే వరకు రాలేదనుకుంటాం.. వచ్చాక దానితో చాలా ఇబ్బందే' అంటోంది చెన్నయ్ బ్యూటీ సమంత. "స్టార్ ఇమేజ్ నాకు త్వరగానే వచ్చింది. అయితే, అప్పటి నుంచే టెన్షన్ మొదలైంది. మొదట్లో ఈ విషయంలో ప్రతి దానికీ టెన్షన్ పడేదానిని. తర్వాత ఇది పధ్ధతి కాదని తెలుసుకుని, మార్చుకున్నాను. ఇప్పుడు అంతా అలవాటైపోయింది' అని చెప్పింది.
*  అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. బన్నీతో పాటు ముఖ్య తారాగణమంతా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. ఇందులో అనూ ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తోంది.
*   ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో జ్యోతిక ప్రధానపాత్ర పోషించిన 'నాచ్చియార్' తమిళ చిత్రం అక్కడ బాక్సాఫీసు విజయాన్ని సాధిస్తోంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి కల్పన కోనేరు హక్కులను తీసుకున్నారు. అనుష్కతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
*  ఇటీవల కొన్ని చిత్రాలలో హీరోగా నటించిన కమెడియన్ సప్తగిరి మరోసారి హీరోగా నటించనున్నాడు. 'సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం', 'సెల్ఫీ రాజా' చిత్రాల ఫేం ఈశ్వర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తాడు.    

More Telugu News