Chandrababu: మీ నేతృత్వంలో ఏపీ అగ్రగామిగా నిలవాలి: చంద్రబాబుకు మంత్రి కాల్వ శ్రీనివాసులు శుభాకాంక్షలు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉండవల్లి సమీపంలో ఉన్న సీఎం చంద్రబాబు నివాసంలో ఈ రోజు పలువురు అధికారులతో కలిసి చంద్రబాబును ఆయన కలిశారు.

 ఈ సందర్భంగా పెన్సిల్ తో గీసిన చంద్రబాబు నాయుడి చిత్రపటాన్ని సీఎంకు అందజేశారు. భవిష్యత్తులోనూ రాజకీయాల్లో చంద్రబాబు తనదైన శైలిలో ముందుకు సాగాలని, ఆయన నేతృత్వంలో నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పరంగా దేశంలోనే అగ్రగామిగా నిలవాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. సీఎంని కలిసిన వారిలో రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu
kalva
Andhra Pradesh
Telugudesam

More Telugu News