షాకింగ్! పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో రూ.1300 కోట్ల స్కాం.. బయటపెట్టిన బ్యాంకు!
- నీరవ్ మోదీ చేసిన అనధికారిక లావాదేవీలను గుర్తించిన పీఎన్‌బీ
- రూ.12,622 కోట్లకు చేరిన నీరవ్ మోదీ కుంభకోణం
- వెల్లడించిన ముంబై స్టాక్ ఎక్స్‌చేంజ్
నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీలు కలిసి 204 డాలర్ల విలువైన అనధికారిక లావాదేవీలు నిర్వహించినట్టు తేలిదంటూ అంతకుముందు స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సమర్పించిన స్టేట్‌మెంట్‌లో పీఎన్‌బీ పేర్కొంది. బ్యాంకు కుంభకోణం వెలుగు చూడడంతో విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని భారత్‌కు రప్పించేందుకు సీబీఐ చర్యలను వేగవంతం చేసింది. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.