bjp: బీజేపీ నేత కిషన్ రెడ్డి వెబ్ సైట్ హ్యాక్
తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి అధికారిక వెబ్ సైట్ ‘కిషన్ రెడ్డి. ఓఆర్జీ’ హ్యాకింగ్ కు గురైంది. ఈరోజు ఉదయం తన వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైందని ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు. ఈరోజు సాయంత్రం డీజీపీని కలసి, ఈ సంఘటనపై దర్యాప్తు చేయించాలని, తగు చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆరు నెలల క్రితం కూడా తన వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైన విషయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రస్తావించారు.