Sridevi: శ్రీదేవి భౌతిక కాయానికి పూర్తయిన పోస్టుమార్టం.. ఆలస్యానికి కారణాలివే!

షార్ట్స్‌లో చూడండి
దుబాయ్‌ లోని జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌ లో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన శ్రీదేవి బౌతికకాయానికి పోస్టు మార్టం పూర్తయిందని యూఏఈకి చెంది ఖలీజా టైమ్స్ పేర్కొంది. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అందగానే బాడీ పాడవకుండా వైద్యులు ఎంబామింగ్ చేస్తారు. ఆ తరువాత వైద్యులు ఆమె మృతదేహాన్ని పోలీసులకు హ్యాండోవర్ చేస్తారు. వారు డెత్ సర్టిఫికెట్‌ ఇష్యూ చేసి, దానిని అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ హ్యాండోవర్ చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తారు. ఈ నిబంధనలు పూర్తయిన వెంటనే శ్రీదేవి మృతదేహాన్ని రిలయన్స్ కు చెందిన విమానంలో భారత్ కు తీసుకురానున్నారు. నేటి సాయంత్రానికి శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకుంటుందని భావిస్తున్నారు. 
Go Back to Shorts
Sridevi
dubai
mumbai

More Telugu News