శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకురావడానికి దుబాయ్ వెళ్లిన అంబానీ విమానం
- దుబాయ్ లో గుండె పోటుతో మృతిచెందిన శ్రీదేవి
- భౌతికకాయాన్ని తీసుకురావడానికి విమానాన్ని పంపించిన ముఖేశ్ అంబానీ
- అంత్యక్రియలకు ముంబైలో ఏర్పాట్లు
నిన్న మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ విమానం ముంబై నుంచి దుబాయ్ కు వెళ్లింది. శవపరీక్షలో ఆలస్యం కారణంగా శ్రీదేవి మృతదేహం స్వదేశం చేరలేదు. శ్రీదేవి పార్థివ దేహంతో పాటు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు ఈ విమానంలో ముంబై చేరనున్నారు. నేడు ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.