day's baby murder: కన్నబిడ్డను చిదిమేసిన కసాయి!

షార్ట్స్‌లో చూడండి
నవమాసాలు మోసింది. పురిటి నొప్పులు కూడా భరించింది. పుట్టిన బిడ్డ ఏడుపును మాత్రం భరించలేకపోయింది. దేశరాజధానిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే... దక్షిణ ఢిల్లీలోని వినోద్‌ నగర్‌ కు చెందిన ఓ మహిళ 25 రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు వేళపాళ లేకుండా ఏడుస్తుండడాన్ని ఓర్చుకోలేకపోయిన ఆ మహిళ కన్నబిడ్డను అత్యంత కర్కశంగా ఊపిరాడకుండా చేసి, చంపేసింది.

అనంతరం పసికందును చెత్తకుండీలో వేసి చేతులు దులుపుకుంది. చెత్తకుండీలో పసికందును చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేసి, బిడ్డ తల్లిని విచారించారు. పదే పదే ఏడుస్తూ బిడ్డ విసిగిస్తోందని, ఎంత సముదాయించినా ఊరుకోవడం లేదని, దాంతో చంపేశానని వారు అవాక్కయ్యే సమాధానం చెప్పింది. విషయం తెలిసిన బాలల హక్కుల కమిషన్‌ ప్రధాన అధికారి జుబేదా సింగ్‌, కన్నబిడ్డ పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
Go Back to Shorts
day's baby murder
New Delhi
mother kill her baby

More Telugu News