ramgopal verma: రాము! ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా: నాగార్జున

  ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనతో తీస్తున్న సినిమా పేరు, విడుదల తేదీలను రేపు మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడిస్తానని చెప్పాడని ప్రముఖ నటుడు నాగార్జున తెలిపారు. ట్విట్టర్ ద్వారా వర్మతో తన సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్న నాగార్జున... రేపు మధ్యాహ్నం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని అన్నారు.

రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా 'శివ' తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత వారిద్దరూ ఆ స్థాయిలో మ్యాజిక్ చూపించలేకపోయారు. మళ్లీ సుదీర్ఘ విరామం తరువాత నాగార్జునతో వర్మ ఈ సినిమా తీస్తున్నాడు. కాగా, ఈ సినిమాలోని క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ మాత్రమే ఇక మిగిలి వుందని నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. 
ramgopal verma
nagarjuna
Twitter

More Telugu News