nithin: 'ఛల్ మోహన్ రంగ' నుంచి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోన్న సాంగ్

  • నితిన్ హీరోగా 'ఛల్ మోహన్ రంగ'
  • కథానాయికగా మేఘా ఆకాష్ 
  • ఆకట్టుకుంటోన్న అందమైన సాంగ్

నితిన్.. మేఘా ఆకాష్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'ఛల్ మోహన్ రంగ' సినిమా రూపొందుతోంది. పవన్ .. త్రివిక్రమ్ .. నితిన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ కథను అందించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన బాణీల నుంచి తాజాగా ఒక పాటను విడుదల చేశారు.

 'గ .. ఘ .. గ ఘ.. మేఘ .. కనులే చెప్పెలే కొత్త సాగా, గ .. ఘ .. గ ఘ .. మేఘ .. నింగే మనకి నేడు పాగా' అంటూ సాగే పాట యూత్ ను బాగా ఆకట్టుకునేదిలా వుంది. యూత్ పై అందమైన అనుభూతులు వెదజల్లేలా వుంది. తెరపై ఈ పాట దృశ్యపరంగా మరింతగా ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తోంది. ఈ పాటతో ఈ సినిమాను యూత్ కి మరింత చేరువ చేయాలనే దర్శక నిర్మాతల ప్రయత్నం ఫలించినట్టుగానే కనిపిస్తోంది. ఈ సినిమాతో నితిన్ కి హిట్ పడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News