ఓబీసీకి రూ.390 కోట్లకు టోపీ పెట్టిన ఆభరణాల సంస్థ!
- విదేశీ క్రెడిట్ లెటర్స్ సాయంతో రుణాలు
- పది నెలలుగా ఆచూకీ లేని కంపెనీ యజమానులు
- ఓబీసీ ఫిర్యాదుతో కేసు దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీలోని కరోల్ భాగ్ ప్రాంతానికి చెందిన ద్వారకాదాస్ సేత్ ఇంటర్నేషనల్ సంస్థ వజ్రాభరణాలు, బంగారు, వెండి ఆభరణాల తయారీ, విక్రయంలో ఉంది. ఓబీసీ గ్రేటర్ కైలాష్-2 శాఖ నుంచి ఈ సంస్థ విదేశీ క్రెడిట్ లెటర్స్ సాయంతో రూ.390 కోట్ల మేర రుణాలు పొందింది. ఈ కంపెనీని సభ్యసేత్, రీతాసేత్, క్రిషన్ కుమార్ సింగ్, రవి కుమార్ సింగ్ నిర్వహిస్తున్నారు. గత పది నెలలుగా వీరి ఆచూకీ లేదు. వారు బ్యాంకుకు ఇచ్చిన చిరునామాల్లో ఉండడం లేదు. దీంతో ఓబీసీ గతేడాది ఆగస్ట్ 16న సీబీఐని సంప్రదించింది. దీనిపై సీబీఐ శుక్రవారమే కేసు నమోదు చేయడం గమనార్హం.