wife: కర్ర పట్టుకుని దూసుకొచ్చి... భర్త ప్రాణాలు కాపాడుకున్న భార్య.. వీడియో వైరల్‌

షార్ట్స్‌లో చూడండి
ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నోలో ఓ మహిళ తన భర్తపై దాడి చేస్తోన్న వారిపై తుపాకీతో కాల్పులు జరిపి వారిని పరుగులు తీయించిన విషయం తెలిసిందే. తాజాగా హర్యానాలోని యుమునా నగర్‌లోనూ ఓ మహిళ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించింది. తన భర్తను చంపేస్తోన్న వారిని తరిమి కొట్టింది. కొంత మంది దుండగులు తన భర్తను కొడుతున్నారని తెలుసుకున్న ఆ మహిళ కర్రలను పట్టుకుని దూసుకొచ్చి దుండగులపై తిరగబడింది.  

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ద్వారా ఆమె భర్త అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఒకరు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 
Go Back to Shorts
wife
husband
Haryana

More Telugu News