sai dharam tej: క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ కి సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్

షార్ట్స్‌లో చూడండి
వరుసగా పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో, ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే ఉద్దేశంతో సాయిధరమ్ తేజ్ వున్నాడు. ప్రస్తుతం ఆయన కరుణాకరన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత ఆయన చంద్రశేఖర్ యేలేటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

చంద్రశేఖర్ యేలేటి పేరు వినగానే 'ఐతే' .. 'అనుకోకుండా'..  'ఒకరోజు' .. 'మనమంతా' వంటి విభిన్నమైన కథా చిత్రాలు గుర్తుకువస్తాయి. ఆయన దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ చేసే కంటెంట్ పై అంతా ఆసక్తితో వున్నారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ చేయనున్న సినిమా, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతుందని అంటున్నారు. ఈ తరహా కథను చేయడం ఇదే మొదటిసారి కావడంతో, తేజు మంచి ఉత్సాహంతో వున్నాడని చెబుతున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.        
Go Back to Shorts
sai dharam tej

More Telugu News