tomoto kechap: 500 గ్రాముల టమాటా కెచప్ ఇట్టే తాగేసి.. వరల్డ్ రికార్డు నెలకొల్పిన ముంబైకర్!

షార్ట్స్‌లో చూడండి
500 గ్రాముల టమాటో కెచప్‌ తో ప్రపంచ రికార్డు సృష్టించాడో ముంబైకర్. గతంలో ద్రాక్ష పండ్లు వేగంగా తినడం, నారింజ పళ్లను వేగంగా తొక్క తీసి తినడం వంటి రికార్డులు నెలకొల్పిన దినేశ్‌ శివంత్‌ ఉపాధ్యాయ 500 గ్రాముల టమాటా కెచప్‌ బాటిల్‌ ను స్ట్రాతో కేవలం 25.37 సెకన్లలో తాగేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో చోటు దక్కించుకున్నాడు.

తొలిసారి 500 గ్రాముల టమాటా కెచప్ బాటిల్‌ ను తాగిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు. రికార్డుల విషయంలో ప్రత్యేకతను నిరూపించుకోవాలనే తానీ పనులకు పూనుకుంటున్నానని దినేశ్‌ శివంత్ ఉపాధ్యాయ తెలిపారు. దినేశ్‌  కెచెప్‌ తాగుతున్న వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఇటీవల తమ సైట్‌లో పోస్ట్‌ చేయగా.. మంచి స్పందన వస్తోంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.  
Go Back to Shorts
tomoto kechap
mumbai
gunnise record

More Telugu News