reliance jio: ఈ ఫోన్లపై జియో రూ.2,200 వరకు క్యాష్ బ్యాక్... ‘ఫుట్ బాల్ ఆఫర్’

షార్ట్స్‌లో చూడండి
రిలయన్స్ జియో తన ప్రస్తుత కస్టమర్లు, కొత్తగా జియోలో చేేరే వారు కొనుగోలు చేసే ఫోన్లపై రూ.2,200 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ తీసుకొచ్చింది. జియో ఫుట్ బాల్ ఆఫర్ కింద 22 కంపెనీల ఫోన్లపై ఈ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. వచ్చే మార్చి 31లోపు ఫోన్లను కొనుగోలు చేసిన వారు జియో 4జీ రూ.198, రూ.299 ప్లాన్లలో ఏదో ఒకటి యాక్టివేట్ చేసుకోవాలి. వెంటనే రూ.50 విలువ కలిగిన 44 వోచర్లు యూజర్ అకౌంట్ లో జమ చేస్తారు. మరుసటి నెల నుంచి ప్రతీ రీచార్జ్ పై రూ.50 వోచర్ ను 44 నెలల పాటు వినియోగించుకోవడం ద్వారా రూ.2,200 ఆదా చేసుకోవచ్చు.

ఫోన్ల వివరాలు
ఎల్ జీ వి30+, జి6, క్యూ6, క్యూ6+, కే7ఐ, జి4, వి20, జి3, జి4 స్టైలస్ సహా ఎల్జీకే చెందిన మరో పదికి పైగా మోడళ్లపై ఈ ఆఫర్ ఉంది. శామ్ సంగ్ గెలాక్సీ ఆన్8, ఆన్5 ప్రో, ఆన్7 ప్రో, ఆన్ మ్యాక్స్, ఆన్ ఎన్ఎక్స్ టీ, జె3, నోకియా 5, 6, మోటొరోలా సి+, ఈ4+, జి5ఎస్+, జి5ఎస్, జెడ్2, లెనొవో కె8+, షియోమి ఎంఐ మ్యాక్స్2, మిక్స్ 2, రెడ్ మి నోట్ 4, వై1, వై1 లైట్, రెడ్ మీ 4, బ్లాక్ బెర్రీ కీ వన్, ఆనర్ 9ఐ, 7ఎక్స్, 9లైట్, ప్యానాసోనిక్ ఎలుగా సిరీస్ ఫోన్లు, స్వైప్ ఎలైట్ ఫోన్లు, ఆసుస్, కోమియో, సెల్ కాన్ మోడళ్లపైనా ఆఫర్ వర్తిస్తుంది.
Go Back to Shorts
reliance jio
cash back offer

More Telugu News