International Market: బంగారం కాస్త నయం.... వెండి కాస్త ప్రియం!

  • తులంపై రూ.70 తగ్గిన బంగారం ధర
  • కిలో వెండిపై రూ.370 మేర పెరుగుదల
  • తులం బంగారం రూ.రూ.31,750, కిలో వెండి రూ.39,750

స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో బంగారం దూకుడుకు బ్రేకులు పడ్డాయి. వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన పసిడి ధర శనివారం స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో తులం (10 గ్రా) బంగారం ధర రూ.70 మేర తగ్గి రూ.31750కి చేరుకుంది. గత రెండ్రోజుల్లో బంగారం ధర దాదాపు రూ.520 మేర పెరిగింది. మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం ధర తగ్గింది. 0.50 శాతం తగ్గడంతో ఔన్సు బంగారం ధర 1346.50 డాలర్లకు చేరుకుంది.

ఇక పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ రావడంతో వెండి ధర మాత్రం కాస్త పుంజుకుంది. శుక్రవారం వెండి ధర కేజీపై రూ.580 మేర తగ్గింది. అయితే ఈ రోజు మాత్రం రూ.370 మేర పెరిగింది. తద్వారా కిలో ధర రూ.39750కి చేరుకుంది. బంగారం ధర తగ్గడం, వెండి ధర పెరగడంపై ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులు ప్రభావం చూపాయని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.

More Telugu News