south africa: ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన కోహ్లీ!

షార్ట్స్‌లో చూడండి
దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన చివరి వన్డే (ఆరో) మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఐదో వన్డేతోనే ఈ సిరీస్ భారత్ సొంతమైనప్పటికీ, చివరి వన్డేలోనూ టీమిండియా తన సత్తా చాటింది. చివరి వన్డేలో దక్షిణాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో ఈ విజయాన్ని కోహ్లీ సేన సాధించింది. 205 పరుగుల విజయ లక్ష్యాన్ని 32.1 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. 129 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కోహ్లీ, ఈ సిరీస్ లో మూడో సెంచరీ చేసి జట్టుకు భారీ విజయం అందించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ను సైతం కోహ్లీ సొంతం చేసుకున్నాడు.
Go Back to Shorts
south africa
india

More Telugu News