అల్లు అర్జున్ తనను ప్రశంసించాడని.. పొంగిపోతున్న ఇంటర్నెట్ సంచలనం ప్రియ ప్రకాశ్!
- ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియా ప్రకాశ్
- అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను
- కేరళలో ఆయనకు అభిమానులు ఎక్కువ
ప్రియతో పాటు ఆమె సహ నటుడు రోషన్ అబ్దుల్ రహూఫ్‌తో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియా మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. అభిమానుల నుంచి తనకు ఇంతటి ఆదరణ లభించినా, అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా ప్రత్యేకమైనదని, తమ రాష్ట్రంలో ఆయనకు అభిమానులు ఎక్కువని చెప్పింది.