గుంటూరులో ఆయన్ని ‘విజిటింగ్ ప్రొఫెసర్’ అని పిలుస్తారు: గల్లా జయదేవ్ పై బీజేపీ నేతల సెటైర్

  • గల్లా జయదేవ్ ఏం సాధించారని ఆయనకు సన్మానం చేశారు?
  • జయదేవ్ ని ‘విజిటింగ్ ప్రొఫెసర్’ అని ప్రజలు పిలుస్తుంటారు
  • వ్యంగ్యాస్త్రాలు సంధించిన బీజేపీ నేతలు పైడా కృష్ణమోహన్, యార్లగడ్డ రాంప్రసాద్
ఏపీకి అన్యాయం జరిగిన విషయమై లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇటీవల ఘాటుగా ప్రసంగించడం తెలిసిందే. పార్టీ శ్రేణులు ఆయన్ని అభినందనలతో ముంచెత్తడమే కాకుండా, ఏపీలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జయదేవ్ ను ఘనంగా సన్మానించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ కార్యవర్గ సభ్యుడు పైడా కృష్ణమోహన్, యువమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రాంప్రసాద్ మాట్లాడుతూ, ఎంపీ గల్లా జయదేవ్ ఏం సాధించారని ఆయనకు సన్మానం చేశారో అర్థం కావడం లేదని విమర్శించారు.

 గుంటూరు లోక్ సభ నియోజకవర్గానికి నేతృత్వం వహించే ఆయన్ని ‘విజిటింగ్ ప్రొఫెసర్’ అని ప్రజలు పిలుస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ పార్టీ నేతలకు మాట్లాడే అవకాశమొస్తే అంతకంటే బాగా మాట్లాడతారని, టీడీపీ నేతలు మృదువైన వ్యాఖ్యల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందని సూచించారు. తమతో పొత్తు తెంచుకోవాలని టీడీపీ భావిస్తే తెంచుకుంటామని, పోటీ పడాలనుకుంటే తాము కూడా పడతామని, అందుకు కావాల్సిన ఆయుధాలు తమ దగ్గర కూడా ఉన్నాయని అన్నారు.  
Go Back to Shorts
galla jayadev
Telugudesam
bjp

More Telugu News