ఎమ్మెల్యే చింతమనేనికి బెయిల్ మంజూరు
- వట్టిపై దాడి కేసులో చింతమనేనికి జైలు శిక్ష
- బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు
- బెయిల్ మంజూరు
ఘటన వివరాల్లోకి వెళ్తే, 2011లో దెందులూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అప్పటి మంత్రి వట్టికి, ఎమ్మెల్యే చింతమనేనికి మధ్య వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా చింతమనేని తనపై దాడి చేశారంటూ దెందులూరు పోలీస్ స్టేషన్ లో వట్టి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడేళ్ల పాటు ఈ కేసును విచారించిన భీమడోలు న్యాయస్థానం... వట్టిపై దాడి జరిగిందని నిర్ధారించి, చింతమనేనికి జైలు శిక్షను విధించింది.