పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం... కుదేలైన షేరు
- ముంబై శాఖలో అక్రమ లావాదేవీలు
- వీటి విలువ సుమారు రూ.11,000 కోట్లు
- కొందరు ఖాతాదారులకు ప్రయోజనం
- దర్యాప్తు ఏజెన్సీలకు ఫిర్యాదు చేశామన్న బ్యాంకు
ఈ లావాదేవీల ఆధారంగా ఆయా ఖాతాదారులకు విదేశాల్లో రుణాలు జారీ అయినట్టు వివరించింది. దీనిపై దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకునేందుకు వీలుగా దర్యాప్తు ఏజెన్సీలకు నివేదించామని, స్వచ్ఛమైన, పారదర్శక బ్యాంకింగ్ సేవలకు కట్టుబడి ఉన్నామని పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో పీఎన్ బీ షేరు ఈ రోజు 7 శాతం పతనమై రూ.150 స్థాయిలో ట్రేడవుతోంది.