షియోమీ నుంచి ఎంఐ టీవీ4 వచ్చేస్తోంది...! రెడ్ మీ నోట్ 5 కూడా
- ఈ నెల 14న ఢిల్లీలో ఆవిష్కరణ సమావేశం
- రెడ్ మీ నోట్ 5 విడుదల దాదాపు ఖాయమే
- ఎంఐ టీవీ4 కూడా విడుదల చేయవచ్చన్న అంచనాలు
దీన్ని పరిశీలిస్తే షియోమీ భారత మార్కెట్లో ఎంఐ టీవీ4ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. భారత మార్కెట్లోకి రానున్న ఉత్పత్తిగా దీన్ని పేర్కొనడం గమనించొచ్చు. ఇదే జరిగితే చైనా తర్వాత షియోమీ తన మొదటి స్మార్ట్ టీవీని విడుదల చేసే మార్కెట్ భారత్ అవుతుంది. అంతేకాదు, స్మార్ట్ ఫోన్ల మాదిరే ఎంఐ స్మార్ట్ టీవీ కూడా దేశీయ యూజర్లకు దగ్గరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయన్నది అంచనా. అయితే, ఈ టీవీకి సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలు, విడుదలయ్యే తేదీ వంటి కీలక సమాచారం ఏదీ కంపెనీ నుంచి ఇంత వరకు వెలువడలేదు.