fighting: హోటల్‌లో కుర్చీలతో ఘోరంగా కొట్టుకున్న విద్యార్థులు.. ఒకరి మృతి.. సీసీ కెమెరాలో రికార్డు

షార్ట్స్‌లో చూడండి
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలహాబాద్‌లో ఓ హోటల్‌లో విద్యార్థులు పరస్పరం ఘోరంగా దాడి చేసుకున్న ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనలో లా రెండో సంవత్సర విద్యార్థి ఒకరు మృతి చెందాడు. దిలీప్ అనే సదరు విద్యార్థి గత రాత్రి కాళికా హోటల్‌లో భోజనం చేసేందుకు తన స్నేహితులతో కలిసి వచ్చాడు. అదే హోటల్‌లో ఉన్న కొంత మంది యువకులకు, దిలీప్‌కి ఓ విషయంలో గొడవ చెలరేగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఇరు వర్గాల యువకులు హోటల్ లోని కుర్చీలు, ఇతర వస్తువులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు విజయ్ శేఖర్ అని గుర్తించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.  
Go Back to Shorts
fighting
Uttar Pradesh
students

More Telugu News