Rajamouli: 'తొలిప్రేమ' సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన రాజమౌళి!

షార్ట్స్‌లో చూడండి
వరుణ్ తేజ్, రాశిఖన్నా జంటగా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన తొలిప్రేమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ అందమైన ప్రేమకథను తెరకెక్కించిన వెంకీ అట్లూరిపై పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ జాబితాలోకి దిగ్గజ ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా చేరిపోయారు. తాను ప్రేమ కథలను పెద్దగా అభిమానించే వాడిని కాకపోయినప్పటికీ, ‘తొలిప్రేమ’ సినిమాని చూసి మాత్రం ఎంజాయ్ చేశానని తెలిపారు.

దర్శకుడు వెంకీ తన తొలి సినిమాని బాగానే హ్యాండిల్ చేశారని రాజమౌళి ప్రశంసించారు. హీరో వరుణ్ తేజ్ తన నటనా సామర్థ్యాలను పెంచుకుంటూ వెళుతున్నాడని, రాశీఖన్నా బ్యూటిఫుల్ గా కనిపించడంతో పాటు బాగా నటించిందని చెప్పారు. ప్రసాద్, బాపినీడుల నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయని, వారికి అభినందనలు తెలుపుతున్నానని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నారు. 
Go Back to Shorts
Rajamouli
tholi prema
sai daram tej
rashi khanna

More Telugu News