ashok: వెంకటేశ్ తో 'భాగమతి' దర్శకుడు?

షార్ట్స్‌లో చూడండి
'పిల్ల జమీందార్' .. 'సుకుమారుడు' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అశోక్, 'భాగమతి' హిట్ తో తన సత్తా చాటుకున్నాడు. దాంతో సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి ఆయనకి కబురు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. 'భాగమతి' సినిమాకి ముందే సురేశ్ ప్రొడక్షన్స్ లో వెంకటేశ్ హీరోగా అశోక్ ఒక సినిమా చేయాలనుకున్నాడు.

వెంకటేశ్ కోసం రెడీ చేసిన కథతో చాలాకాలం పాటు తిరిగాడట. అయితే అటు వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో, 'భాగమతి'పై దృష్టి పెట్టాడు. ఇప్పుడు ఈ సినిమా హిట్ కావడంతో, సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. మరి గతంలో వినిపించిన కథనే ఓకే చేస్తారా? లేదంటే కొత్త కథతో రమ్మంటారోననేది ఆసక్తికరంగా మారింది. వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్ కాకపోతే, మరో ప్రాజెక్టుతో .. మరో హీరోతో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో అశోక్ ఉన్నాడని చెప్పుకుంటున్నారు. 
Go Back to Shorts
ashok
venkatesh

More Telugu News