Rajasthan: అత్తింటి సొత్తే వారి లక్ష్యం... కోడలిగా వస్తారు.. దర్జాగా పారిపోతారు!

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ నటించిన 'డాలీ కీ డోలీ' చిత్రం చూశారా? అందులో హీరోయిన్ తన అత్తగారింట్లో కొత్త కోడలిగా కాలు మోపి, దొంగతనం చేసి ఉడాయిస్తుంది. సరిగ్గా ఇప్పుడు అలాగే జరుగుతోంది రాజస్థాన్ లో. తమ అబ్బాయికి పెళ్లి చేసి కొత్త కోడలిని ఇంటికి తెచ్చుకున్నామన్న ఆనందాన్ని మిగలనీయకుండా, కొత్త పెళ్లికూతుళ్లు, దొరికిన కాడికి దోచుకోని ఉడాయిస్తున్నారు.

2014 నుంచి 2017 వరకూ వివాహం చేసుకుని అత్తింటి సొత్తుతో పారిపోయిన వారి గణాంకాల వివరాలను రాజస్థాన్ పోలీసులు విడుదల చేశారు. రాజస్థాన్ లో ఈ తరహా కేసులు 103 నమోదయ్యాయని, వీరు దాదాపు 1.75 కోట్లను దొంగిలించి, పారిపోయారని పోలీసు అధికారులు చెబుతున్నారు. వీరి టార్గెట్ నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులేనని, వీరి వెనుక మధ్యవర్తుల ప్రమేయం ఉండి ఉండవచ్చని, పలువురు తమ పరువు పోతుందని ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Rajasthan
Marriage
Theft
Bride
Groom

More Telugu News