ఏపీ ప్రజలను మరోసారి ఫూల్స్ ను చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది: సీపీఐ నేత రామకృష్ణ
- కంభంపాటి హరిబాబుకు సీపీఐ నేత బహిరంగ లేఖ
- అమలు కాని ప్రకటనలతో ప్రజలను మోసం చేశారు
- ఏపీకి నాలుగేళ్లలో ఇవ్వలేని నిధులు రెండేళల్లో ఇస్తారా?
- ఏడాదికి రూ.50 కోట్ల ముష్టితో ఒక జిల్లా అభివృద్ధి సాధ్యమా?: రామకృష్ణ
ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట వాస్తవం కాదా? ఏపీకి నాలుగేళ్లలో ఇవ్వలేని నిధులు రెండేళల్లో ఇస్తామంటే ప్రజలు నమ్మాలా? ఏడాదికి రూ.50 కోట్ల ముష్టితో ఒక జిల్లా అభివృద్ధి సాధ్యమా? అని ఆ లేఖలో రామకృష్ణ ప్రశ్నించారు. కాగా, ఏపీకి బీజేపీ ఏం చేసిందో వివరించడానికి తాను సిద్ధమని, అన్ని వివరాలు తన దగ్గర ఉన్నాయని ఆ పార్టీ నేత కంభంపాటి హరిబాబు పేర్కొన్న విషయం తెలిసిందే.