Lok Sabha: తెలుగుదేశం సభ్యుల నినాదాలు.. ఐదంటే ఐదు నిమిషాల్లోనే లోక్ సభ వాయిదా!

షార్ట్స్‌లో చూడండి
ఈ ఉదయం 11 గంటలకు లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాగా, ఆపై ఐదు నిమిషాలకే వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తుండటం, వారికి మద్దతుగా కొంతమంది కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల్లో లేచి నిలబడి అరుస్తుండటంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడగా, ప్రశ్నోత్తరాలను కొనసాగించే అవకాశం కనిపించలేదు. దీంతో సభను 12 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. ఆపై టీడీపీ సభ్యులు పార్లమెంట్ వెలుపలకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని తమ నిరసనలు తెలియజేస్తున్నారు.
Go Back to Shorts
Lok Sabha
Sumitra Mahajan
Telugudesam

More Telugu News